సైఫ్ సర్ సారీ.. ఊర్వశీ రౌతేలా పోస్ట్

దుండగుడి దాడిలో గాయపడి చికిత్స పొందుతోన్న సైఫ్ అలీ ఖాన్‌కు బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా సారీ చెప్పారు.

By Knakam Karthik
Published on : 18 Jan 2025 11:41 AM IST

National News, Entertainment, Bollywood News, Saif Ali Khan, Urvashi Rautela post

సైఫ్ సర్ సారీ.. ఊర్వశీ రౌతేలా పోస్ట్

దుండగుడి దాడిలో గాయపడి చికిత్స పొందుతోన్న సైఫ్ అలీ ఖాన్‌కు బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా సారీ చెప్పారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన బాలీవుడ్ సినీ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. గత రెండ్రోజుల క్రిత సైఫ్ నివాసంలోకి ప్రవేశించిన దొంగ అతడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్‌ ముంబయిలోని లీలావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. శస్త్ర చికిత్స చేసి సైఫ్ వెన్నుముక నుంచి రెండు అంచుల కత్తిని డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.

అయితే బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన త్వరగా కోలుకోవాలన్నారు. అయితే, ఆ సమయంలో ఊర్వశీ తన వజ్రపు ఉంగరాన్ని చూపించడం దాని గురించి మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. తాజాగా ఈ విషయంపై ఆమె సైఫ్‌కు క్షమాపణలు చెప్పారు.


ఈ మేరకు ఇన్ స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. “సైఫ్ సర్.. మీకు ఈ మెసేజ్ చేరుతుందని ఆశిస్తున్నాను. మీ గురించి మాట్లాడే సమయంలో నేను ప్రవర్తించిన తీరుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ విషయంలో మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. ఆ ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో మీపై జరిగిన దాడి తీవ్రత నాకు తెలియదు. గత కొన్ని రోజుల నుంచి నేను డాకు మాహారాజ్ విజయోత్సాహంలో ఉన్నాను. దీంతో ఆ సినిమా వల్ల నాకు వచ్చిన బహుమతులు గురించి మాట్లాడాను. ఈ విషయంలో సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమించండి. ఈ దాడి తీవ్రత తెలిశాక చాలా బాధపడ్డాను. ఆ సమయంలో మీ ధైర్యం నిజంగా ప్రశంసనీయం. మీ పై గౌరవం పెరిగింది” అంటూ రాసుకొచ్చింది.

Next Story