స్టైలిష్ స్టార్ సరసన బాలీవుడ్ హీరోయిన్..?

Saiee Manjrekar to act with Allu Arjun. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కథానాయికగా బాలీవుడ్‌ నటి సయీ మంజ్రేకర్‌ ఎంపికైనట్లు సమాచారం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2021 8:32 AM GMT
Saiee Manjrekar to act with Allu Arjun

తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోలలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఒక‌రు. ప్ర‌స్తుతం బ‌న్ని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలా వైకుంఠపురం సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల చిత్రనిర్మాణం వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది.

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను ఇదివరకే చిత్ర బృందం విడుదల చేసింది. కాగా ఈ సినిమాకి సంబంధించిన మరొక విషయం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కథానాయికగా బాలీవుడ్‌ నటి సయీ మంజ్రేకర్‌ ఎంపికైనట్లు సమాచారం.

సయీ మంజ్రేకర్‌ ఇదివరకే కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన బాలీవుడ్ ఇండస్ట్రీలో "దబాంగ్ 3" లో నటించారు. అయితే ఈ బాలీవుడ్ భామ తెలుగు ఇండస్ట్రీలో కూడా అడవి శేషు నటిస్తున్న "మేజర్ " సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించే చిత్రంలో సయీ మంజ్రేకర్‌ నటించే అవకాశం దక్కించుకుందనే సమాచారం వెలువడుతోంది. అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న "పుష్ప" సినిమా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న"ఆచార్య"సినిమాలు పూర్తవగానే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న #AA21 పట్టాలెక్కనుందనే సమాచారం తెలుస్తోంది.


Next Story