సాయి పల్లవి కొత్త సినిమా మొదలైంది

Sai Pallavi In Kamal Haasan’s Production. దక్షిణాదిలో భారీ ఫాలోయింగ్ ఉన్న సాయి పల్లవి చాలా గ్యాప్ తీసుకుని కొత్త సినిమాను మొదలుపెట్టింది.

By Medi Samrat  Published on  5 May 2023 7:45 PM IST
సాయి పల్లవి కొత్త సినిమా మొదలైంది

Sai Pallavi In Kamal Haasan’s Production


దక్షిణాదిలో భారీ ఫాలోయింగ్ ఉన్న సాయి పల్లవి చాలా గ్యాప్ తీసుకుని కొత్త సినిమాను మొదలుపెట్టింది. ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరో..! శివకార్తికేయన్ కి ఇది 21వ సినిమా. ఈ సినిమా కమల హాసన్ సొంత బ్యానర్ లో నిర్మితమవుతూ ఉంది. ఈ రోజున చెన్నైలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

శివకార్తికేయన్‌ను అతని అభిమానులు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో ప్రజంట్ చేయనున్నారు. దేశభక్తి కథాంశంతో రూపొందనున్న చిత్రం. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ కు జోడిగా సాయి పల్లవి కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌ లోని అద్భుతమైన లొకేషన్లలో జరగనుంది.


Next Story