విరూపాక్ష.. పాన్ ఇండియా రేంజిలో వండర్స్ చేస్తాడా..?

Sai Dharam Tej's next titled 'Virupaksha', Jr NTR gives voiceover. కంటెంట్ ఉంటే చాలు.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు.

By M.S.R  Published on  7 Dec 2022 3:22 PM IST
విరూపాక్ష.. పాన్ ఇండియా రేంజిలో వండర్స్ చేస్తాడా..?

కంటెంట్ ఉంటే చాలు.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు. ఈ విషయాన్ని ఇటీవలి కాలంలో పలు సినిమాలు నిరూపించాయి. తాజాగా టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా అలాంటి సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. 'విరూపాక్ష' సాయితేజ్ కి 15వ సినిమా. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి టైటిల్ ను రివీల్ చేశారు. టైటిల్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ను వదిలారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పటిలాగే వాయిస్ ఓవర్ తో అదరగొట్టగా.. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. "అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం" అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ స్క్రీన్ ప్లేను అందించిన ఈ సినిమాకి ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. కాంతార ఫేమ్ అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రానుంది. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల కానుంది.



Next Story