షాకింగ్‌.. ప‌ర్స్‌లు కొట్టేస్తూ ప‌ట్టుబ‌డిన న‌టి.. చోరీ చేసిన వివరాలను డైరీలో రాసుకుంది

Rupa Dutta arrested for alleged pickpocketing at International Kolkata Book Fair.న‌టిగా ఆమెకు మంచి పేరుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2022 8:11 PM IST
షాకింగ్‌.. ప‌ర్స్‌లు కొట్టేస్తూ ప‌ట్టుబ‌డిన న‌టి.. చోరీ చేసిన వివరాలను డైరీలో రాసుకుంది

న‌టిగా ఆమెకు మంచి పేరుంది. సంపాద‌న కూడా బాగానే ఉంది. అయితేనేం.. ఆమె బుద్ది వంక‌ర‌. దొంగ‌త‌నం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఇంత‌కీ ఆమె ఎవ‌రు అని అంటారా..? ఆమె ఎవ‌రో కాదు బెంగాలీ నటి రూపా దత్తా.. కోల్​కతాలో జరుగుతున్న అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో దొంగతనం చేసినందుకు రూపా దత్తా ​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

వివ‌రాల్లోకి వెళితే.. ఇంటర్నేషనల్‌ బుక్ ఫెయిర్‌లో ఖాళీ వ్యాలెట్‌ల‌ను(ప‌ర్సు) చెత్త బుట్టిలో పారేస్తూ రూపా దత్తా భ‌ద్ర‌తా సిబ్బందికి దొరికిపోయింది. ఆమె వ్య‌వ‌హారం అనుమానాస్ప‌దంగా ఉండ‌డంతో పోలీసులు ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను చెక్ చేశారు. రూ.65,760 న‌గ‌దుతో పాటు పెద్ద మొత్తంలో ప‌ర్సులు ఉన్నాయి. దీనిపై ఆమెను ప్ర‌శ్నించ‌గా.. పొంత‌న‌లేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వ‌ద్ద ఉన్న డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులకు అందులో ఉన్న విష‌యాలు చూసి ఒక్క‌సారిగా మైండ్ బ్లాంక్ అయింది.

రూపా దత్తాకు చోరీలు చేయ‌డం కొత్తేమీ కాద‌ని తెలిసింది. ఇంత‌క‌ముందు చాలా సార్లు దొంగ‌త‌నానికి పాల్ప‌డింది. అందుకు సంబంధించిన వివ‌రాల‌న్నింటీని(చోరీ చేసిన ప్రాంతాల పేర్లు) డైరీలో రాసి పెట్టుకుంది. దీనిపై ఆమెను ప్ర‌శ్నించ‌గా.. తాను చేసిన‌ట్లు అంగీక‌రించింది. దీంతో ఆమెపై ప‌లు సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆదివారం ఆమెను కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా ఒక రోజు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి అనుమ‌తి ఇచ్చింది. ఆమె ద‌ర‌ఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిష‌న్‌ను ర‌ద్దు చేసింది. కోర్టులో ఆమె త‌న వాద‌న‌లు వినిపించింది. తాను శీత‌ల‌పానియాన్ని తాగిన అనంత‌రం ఆ బాటిల్‌ను డ‌స్ట్ బీన్‌లో ప‌డేస్తుండ‌గా.. అందులో బ్యాగ్ క‌నిపించిందని.. దాన్ని తీసుకుని చూస్తుండ‌గా పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు తెలిపింది. ఆ బ్యాగ్ త‌న‌ది కాద‌ని చెప్పుకొచ్చింది.

బెంగాల్‌లో అనేక సీరియ‌ల్స్‌లో న‌టించిన రూపా ద‌త్తా.. గ‌తంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసింది. అనురాగ్ కశ్యప్ తనకు అసభ్యకర సందేశాలు పంపిచాడని ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.

Next Story