రెండో భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ నటి

బాలీవుడ్‌ బ్యూటీ రుక్సార్‌ రెహమాన్ తన రెండో భర్తతో విడిపోతున్నట్లు తాజాగా ప్రకటించింది.

By Srikanth Gundamalla  Published on  1 July 2023 1:03 PM IST
Rukhsar Rehman, divorce, second Husband, Farooq, Bollywood

రెండో భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ నటి

బాలీవుడ్‌ బ్యూటీ రుక్సార్‌ రెహమాన్ తన రెండో భర్తతో విడిపోతున్నట్లు తాజాగా ప్రకటించింది. కొద్ది రోజులుగా రెండో భర్త ఫరూఖ్‌ కబీర్‌తో రుక్సార్‌ రెహమాన్‌ విడిపోయినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు తెగ చక్కర్ల కొట్టాయి. ఆ వార్తలను నిజం చేస్తూ రుక్సార్‌ రెహమాన్‌ కీలక ప్రకటన చేసింది. ఫరూఖ్‌తో విడిపోయానని ఆమె స్వయంగా తేల్చి చెప్పింది. 2023 ఫిబ్రవరి నుంచే తాము విడిగా ఉంటున్నట్లు పేర్కొంది. ఇద్దరి అంగీకారంతోనే దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. ఇక ఫరూఖ్‌తో విడాకులు కూడా తీసుకుంటున్నానని.. దాని కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే..ఎందుకు విడిపోవాల్సి వస్తుందనే కారణాలను మాత్రం బయటకు చెప్పడం ఇష్టం లేదని రుక్సార్‌ రెహమాన్‌ చెప్పింది.

రుక్సార్ రెహమాన్‌ మొదట అసద్‌ అహ్మద్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు ఉంది పేరు ఐషా అహమద్. రుక్సార్‌, అసద్‌ మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత దర్శక నిర్మాత ఫరూఖ్‌తో రుక్సానా కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసింది. ఆ తర్వాత 2010లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. 13 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత రెండో భర్తతోనూ రుక్సార్ విడాకులు తీసుకుంటుండటం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

రుక్సార్‌ రెహమాన్‌ తన చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హీరోయిన్‌గా సినిమాలు చేసింది. రిషీకపూర్‌తో ఓ సినిమా చేశాక.. దాదాపు 13ఏళ్లు బ్రేక్‌ తీసుకుంది. మళ్లీ రాంగోపాల్‌ వర్మ సర్కార్‌ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు, వెబ్‌ సిరీసుల్లో నటిస్తూనే ఉంది రుక్సార్‌ రెహమాన్.

Next Story