మే 20న ఆర్ఆర్ఆర్ పై క్లారిటీ
RRR Team Gives Clarity On May 20th. ఆర్.ఆర్.ఆర్. సినిమా ఎప్పుడు విడుదల మే 20న తప్పకుండా క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు.
By Medi Samrat
ఆర్.ఆర్.ఆర్. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ వెళుతోంది. ఇప్పటి వరకూ రిలీజ్ డేట్లను ఆర్.ఆర్.ఆర్. టీమ్ మార్చేసింది. అక్టోబర్ 13, 2021న ఆర్.ఆర్.ఆర్.ను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని భావిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి పరిస్థితుల్లో ఆ రిలీజ్ డేట్ కు కూడా వచ్చే అవకాశమైతే కనిపించడం లేదు.
ఆర్.ఆర్.ఆర్. సినిమా తర్వాతి సంవత్సరానికి వాయిదా పడే అవకాశం ఉందని చాలా మంది అంటూ ఉండగా.. మే 20న తప్పకుండా క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మే20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఏదైనా టీజర్, పోస్టర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని అందరూ భావిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే..! ఈ విషయాన్ని తారక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. అయితే ఎవరు కూడా టెన్షన్ పడకండి అని చెప్పారు. ప్రస్తుతానికి ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. నేను, నా కుటుంబం ఐసోలేషన్ లో ఉన్నామని.. వైద్యులు చెప్పిన అన్ని సలహాలను పాటిస్తూ ఉన్నామని తెలిపారు. ఇటీవలి కాలంలో తనకు దగ్గరగా వచ్చిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.
ఇలాంటి సమయంలో మే 20న ఆర్.ఆర్.ఆర్. టీమ్ ఎటువంటి సర్ప్రైజ్ ప్లాన్ చేసిందో.. లేక గత ఏడాది లాగా.. ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ బర్త్ డేకి ఎటువంటి సందడి సోషల్ మీడియాలో లేకుండా పోతుందేమో అనే ఆందోళన అభిమానుల్లో ఉంది. ఏది ఏమైనా ఒక క్లారిటీ మే20న రావడం మాత్రం పక్కా అని అందరూ అభిప్రాయపడుతూ ఉన్నా