ఆర్ఆర్ఆర్ మరోసారి రిలీజ్

RRR release once again. గతేడాది మార్చి 25న విడుదలైన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ RRR మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది.

By M.S.R  Published on  27 Feb 2023 7:00 PM IST
ఆర్ఆర్ఆర్ మరోసారి రిలీజ్

గతేడాది మార్చి 25న విడుదలైన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ RRR మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచి.. అవార్డుల మీద అవార్డులు అందుకుంటున్న ఆర్ఆర్ఆర్ సినిమాను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా.. యూఎస్ఏలోనూ మళ్లీ రిలీజ్ చేయనున్నారు. మార్చి 3న దాదాపు 200 థియేటర్ల రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం పలు ప్రపంచ ప్రఖ్యాత అవార్డులను సొంతం చేసుకుంది. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ ప్రశంసలు కురిపించారు. ఆస్కార్స్ బరిలో నిలవడంతో పాటు.. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను దక్కించుకుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ను మరోసారి రీరిలీజ్ చేస్తూ ఉండడం విశేషం. భారత్ లో ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ ఆగిపోయినా.. ఇటీవల జపాన్‌లో 1 బిలియన్ జపనీస్ యెన్ మార్కును అధిగమించింది. జపాన్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు రీరిలీజ్ లో ఇంకెంత వసూళ్లు చేస్తుందో చూడాలి.


Next Story