ఆర్ఆర్ఆర్‌కు తప్పని లీకుల బెడద.. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ పిక్స్‌ లీక్

RRR pics leaked Online goes viral.టాలీవుడ్‌ను లీకుల బెడ‌ద ప‌ట్టి పీడిస్తుంది. ఆర్ఆర్ఆర్‌కు తప్పని లీకుల బెడద.. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ పిక్స్‌ లీక్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2021 9:56 AM IST
RRR pics leaked Online goes viral

టాలీవుడ్‌ను లీకుల బెడ‌ద ప‌ట్టి పీడిస్తుంది. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్, క్రిష్‌-ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రంతో పాటు కొన్ని సినిమాల‌కు సంబంధించిన స్టిల్స్, వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తాజాగా ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌( ర‌ణం రౌద్రం రుధిరం) చిత్రానికి కూడా లీకేజీ స‌మ‌స్య త‌ప్ప‌డం లేదు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని చిత్రాలు లీకేజీ అయ్యాయి. ఇందులో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర పోషిస్తున్న‌ ఎన్టీఆర్.. సంకెళ్ళు తెంచుతున్న‌ట్టుగా కనిపిస్తున్నాడు.

మ‌రో పోస్ట‌ర్‌లో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తున్న‌ రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నాడు. ఒలీవియా, ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫొటో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. జ‌క్క‌న్న ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న సినిమా నుండి ఇలాంటి స్టిల్స్ కావ‌డం చిత్ర బృందాన్ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగే రెండు నిజ‌మైన పాత్ర‌ల‌కు సంబంధించిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ మూవీగా రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ తెర‌కెక్కిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు. ఎన్టీఆర్‌, చరణ్‌లతో పాటు అజయ్ దేవగణ్‌, ఆలియా భట్‌, రే స్టీవెన్‌ సన్, అలిసన్‌ డూడి, సముద్రఖని తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.




Next Story