కన్ఫర్మ్ అయినట్లా.. అనుకున్న సమయానికే ఆర్ఆర్ఆర్

RRR Movie Release Update. ఆర్.ఆర్.ఆర్. సినిమా ప్రస్తుతానికైతే వాయిదా పడినట్లు కనిపించడం లేదు. అనుకున్న డేట్ కే రిలీజ్ ను ప్లాన్ చేస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  21 May 2021 4:32 PM IST
RRR Movie

ఆర్.ఆర్.ఆర్. సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే..! ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా సినిమాల రిలీజ్ లు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతున్నట్లు ప్రకటించేశాయి. ఆర్.ఆర్.ఆర్. సినిమా కూడా వాయిదా పడుతుందేమోనని భావించారు. ప్రస్తుతానికైతే వాయిదా పడినట్లు కనిపించడం లేదు. అనుకున్న డేట్ కే రిలీజ్ ను ప్లాన్ చేస్తూ ఉన్నారు.

ఈ సినిమాను అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా కొంత చిత్రీకరణ మిగిలి ఉంది. కరోనా కారణంగా షూటింగు ఆగిపోవడంతో ఈ సినిమా విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇంకొన్ని నెలల్లో కరోనా వ్యాప్తి తగ్గిపోతే తప్పకుండా సినిమాను అనుకున్న సమయానికే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట..! ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, ముందుగా చెప్పిన రోజునే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు.

ఎన్టీఆర్ పుట్టినరోజు పోస్టర్ పై కూడా అక్టోబర్ 13 అనే ఉండడంతో అదే రోజున ఈ సినిమా రానుందనే భావిస్తూ ఉన్నారు. భారతదేశంలో కరోనా పరిస్థితుల్లో మార్పు కనపడకపోతే మాత్రం సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.


Next Story