షూటింగ్‌లో ప్ర‌మాదం.. హీరోకు అంటుకున్న మంట‌లు

Rishab Shetty fire accident in hero movie shooting set. క‌న్న‌డ సినిమా షూటింగ్‌లో భాగంగా కొన్ని ఫైట్ సీన్ల‌ను చిత్రీక‌రిస్తుండ‌గా.. ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో హీరోతో పాటు స‌హాన‌టుడు గాయ‌ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2021 3:38 AM GMT
Rishab Shetty fire accident in hero movie shooting

ఒక‌ప్పుడు రిస్కీ స్టంట్స్‌ని డూప్స్ సాయంతో చేసేవారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో హీరోలే స్వ‌యంగా రంగంలోకి దిగుతున్నారు. ఈనేప‌థ్యంలో కొన్ని సార్లు ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు. తాజాగా ఓ క‌న్న‌డ సినిమా షూటింగ్‌లో భాగంగా కొన్ని ఫైట్ సీన్ల‌ను చిత్రీక‌రిస్తుండ‌గా.. ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో హీరోతో పాటు స‌హాన‌టుడు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే.. క‌న్న‌డ న‌టుడు రిష‌బ్ శెట్టి హీరోగా హీరో చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ క‌ర్ణాట‌క రాష్ట్రంలోని హాస‌న్ జిల్లాల బేలూరులో జ‌రుగుతోంది.

ఓ స‌న్నివేశంలో భాగంగా పెట్రోల్‌ బాంబు విసిరి నటులు హీరో రిషబ్, గానావి లక్ష్మణ పరారీ పారిపోవాల్సి ఉంటుంది. అయితే.. పెట్రోల్ బాంబ్ విసిరి వారు ప‌రిగెత్తేలోపు మంట‌లు అంటుకున్నాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది మంట‌ల‌ను ఆర్పి వారికి ప్ర‌థ‌మ చికిత్స అందించారు. అనంత‌రం ఇద్దరిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. వారిద్ద‌రికి పెద్ద ప్ర‌మాదం ఏమీ జ‌ర‌గ‌లేద‌ని డాక్టర్లు చెప్పారు.
Next Story