'కాంతారా - 2' అప్ డేట్.. త్వరలోనే సెట్స్ పైకి..

Rishab Shetty begins scripting Kantara prequel for June start date. కన్నడ మూవీ కాంతారా బాక్సాఫీస్ వద్ద వరుసగా రికార్డుల మోత మోగించింది.

By Sumanth Varma k  Published on  22 Jan 2023 3:41 PM IST
కాంతారా - 2  అప్ డేట్.. త్వరలోనే  సెట్స్ పైకి..
కన్నడ మూవీ కాంతారా బాక్సాఫీస్ వద్ద వరుసగా రికార్డుల మోత మోగించింది. చిన్న సినిమాగా వచ్చిన కాంతారా పెద్ద హిట్ అయ్యింది. అందుకే, ఈ కాంతారా సినిమాకు సీక్వెల్ గా కాంతారా - 2 తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సీక్వెల్లో హీరో తండ్రి జీవితం గురించి తెరెకెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రిషబ్ శెట్టి అండ్ అతని టీమ్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కాంతారా - 2 రెగ్యులర్ షూట్ ను ప్లాన్ చేయాలని రిషబ్ శెట్టి ప్లాన్ చేస్తున్నాడు. అలాగే వచ్చే ఏడాది 2024 సమ్మర్ లో కాంతారా - 2 ను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.


ఇప్పటికే, దర్శకుడు రిషబ్ శెట్టి కర్ణాటకలోని కోస్టల్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ నేపథ్యాన్ని అడిగి తెలుసుకుంటున్నాడు. కాంతారా సినిమా సీక్వెల్ లో మరిన్ని విషయాలను చెప్పాలని రిషబ్ శెట్టి నిర్ణయించుకున్నాడు. మరి అతని ప్రయత్నం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. కాంతారా ఐతే ఎన్నో రికార్డులను నమోదు చేసింది. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో యశ్ నటించిన కేజీఎఫ్ -1 త‌ర్వాత‌.. ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో కేజీఎఫ్ - 2 రూ.1207 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన కాంతారా రెండో స్థానంలో ఉంది. మరి అలాంటి కాంతారాకి సెకండ్ పార్ట్ అంటే.. ఇక అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


Next Story