తమిళ సినిమా 'లవ్ టుడే' ఫేమ్ నటించిన ప్రదీప్ రంగ నాథన్ నటించిన లేటెస్ట్ మూవీ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'.అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 21న తమిళంతో పాటు తెలుగులోనూ ఒకే సారి థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ను ఈ మూవీ బాగా ఆకట్టుకుంది. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీసు ముందు హిట్‌గా నిలిచింది. రూ.37 కోట్లతో బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం రూ. 150 కోట్లు వసూలు చేసింది.
గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే అంతలోనే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మార్చి 21 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది.