బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకు 'ధమాకా'తో పెద్ద ఊరట లభించింది. ఈ చిత్రం నటి శ్రీ లీల, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కెరీర్ కు ప్లస్ అయింది. ఈ సినిమా రవితేజ, దర్శకుడు త్రినాథరావు నక్కిన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
రవితేజ ప్రస్తుతం సమ్మర్ సీజన్‌లో విడుదల కానున్న 'మాస్ జాతర' సినిమాతో బిజీగా ఉన్నారు. త్రినాధరావు దర్శకత్వం వహించిన చిత్రం, సందీప్ కిషన్ నటించిన మజాకా ఈ శివరాత్రి పండుగకు ఫిబ్రవరి 25 రాత్రి ప్రీమియర్లతో ఫిబ్రవరి 26న విడుదలవుతోంది. మజాకా ప్రమోషన్స్‌లో దర్శకుడు ధమాకా కాంబినేషన్ ను కన్ఫర్మ్ చేశారు. మరో సినిమా రవితేజతో చేయబోతున్నట్లు తెలిపారు. దిల్ రాజు నిర్మాణంలో రవితేజ, తాను కలిసి ఓ సినిమా చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే స్క్రిప్ట్ నేరేషన్ కూడా పూర్తయిందని తెలిపారు.