విడుదలైన ఎన్టీఆర్‌ 'దేవర' సినిమా.. పబ్లిక్‌ టాక్‌ ఇదే

జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'దేవర' సినిమా ప్రీమియర్లు పడ్డాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By అంజి  Published on  27 Sept 2024 7:56 AM IST
NTR, Devara movie,public talk, Tollywood

విడుదలైన ఎన్టీఆర్‌ 'దేవర' సినిమా.. పబ్లిక్‌ టాక్‌ ఇదే

జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'దేవర' సినిమా ప్రీమియర్లు పడ్డాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి పాన్‌ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నుంచి ఈ సినిమా వచ్చింది. అభిమానులు ప్రీమియర్‌ షోల్లో సందడి చేస్తున్నారు. హిందీలో కూడా ఇంతే క్రేజ్‌తో భారీ ఎత్తున రిలీజ్‌ అయ్యింది. సినిమాలో ఎన్టీఆర్‌ మాస్‌ యాక్టింగ్‌తో అదరగొట్టారని, కొన్ని సీన్లు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయని నెట్టింట ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంటర్వేల్‌ థ్రిల్లింగ్‌ ట్విస్ట్‌, అనిరుధ్‌ బీజీఎం అదిరిపోయాయని చెబుతున్నారు.

వీఎఫ్‌ఎక్స్‌ ఇంకా బాగుండాల్సిందని, జాన్వీని పాటలకే పరిమితం చేశారని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. 2.50 గంటల రన్‌టైమ్‌ ఉన్న సినిమాను హిందీ ప్రేక్షకుల కోసం 7 నిమిషాలు ట్రిమ్‌ చేసినట్టు తెలుస్తోంది. తెలుగు నటీనటులకు సంబంధించిన కొన్ని సోలో సన్నివేశాలను కత్తిరించినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాకు ఎన్టీఆర్‌ ఫర్మామెన్స్‌, యాక్షన్‌ సీక్వెన్సెస్‌, రత్నవేలు ఫొటోగ్రఫీ, అనిరుధ్‌ మ్యూజిక్‌, సినిమా ఫస్టాప్‌ ప్లస్‌ పాయింట్స్‌గా ఉన్నాయి. ఇక డ్రాగ్‌ సెకండాఫ్‌, ఆన్‌ సాటిస్పైడ్‌ క్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌గా ఉన్నాయి.

అటు కడపలోని రాజా థియేటర్‌ వద్ద ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ చేశారు. 'దేవర' రిలీజ్‌ షో సందర్భంగా చాలా మంది అభిమానులు టికెట్‌ లేకుండానే థియేటర్‌లోకి దూసుకొచ్చారు. వారిని ఆపే క్రమంలో ఫ్యాన్స్‌, థియేటర్‌ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొంత మంది అభిమానులు సిబ్బందిని చితకబాదారు. దీంతో నిర్వాహకులు షోను నిలిపివేశారు.

Next Story