అంత‌టికీ ఆ గొడ‌వే కార‌ణ‌మా.?

కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణం కూతురుతో గొడవేనని సమాచారం. ఇవాళ కల్పన స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు.

By Knakam Karthik  Published on  5 March 2025 1:02 PM IST
Cinema News, Tollywood, Singer Kalpana, Sucide Attempt,

అంత‌టికీ ఆ గొడ‌వే కార‌ణ‌మా.?

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం విష‌యం ప్ర‌స్తుతం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణం కూతురుతో గొడవేనని క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలావుండ‌గా.. పోలీసులు కల్పన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసే ప్ర‌యత్నం కూడా చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌చారంలో ఉన్న క‌థ‌నాల ప్ర‌కారం.. కల్పన పెద్ద కూతురు కేరళలో ఉంటోంది. మంగళవారం కూతురుకు ఫోన్ చేసిన కల్పన.. ఆమెను హైదరాబాద్ రావాలని కోరింది. అయితే, కేరళలోనే ఉంటానని.. హైదరాబాద్ కు రానని కూతురు తెగేసి చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై ఫోన్లో తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరగ‌గా.. మనస్తాపం చెందిన కల్పన.. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డార‌ని తెలుస్తుంది.

దీని త‌ర్వాత చెన్నై నుంచి భర్త ప్రసాద్ సాయంత్రం 4:30 గంటలకు ఫోన్ చేయగా కల్పన లిఫ్ట్ చేయలేదు. పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో విల్లా సెక్రటరికి కాల్ చేసి చెప్పానని, ఆయన వెళ్లి తలుపు తట్టినా తెరవలేదని ప్రసాద్ వివరించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లారని, బెడ్ రూంలో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని ఆయన తెలిపారు. ఏం జ‌ర‌గింద‌నే విష‌య‌మై క్లారిటీ రావాల్సివుంది.

Next Story