మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. RC16 నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు ఓ క్రేజీ అప్‌డేట్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, అలాగే టైటిల్‌ను మూవీ టీమ్ ప్రకటించింది. అయితే, ఈ మూవీకి 'పెద్ది' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ టైటిల్ పోస్టర్‌లో రామ్ చరణ్ ఊర మాస్ గెటప్‌లో కనిపించారు.
కాగా రామ్ చరణ్ నటిస్తున్న RC16 సినిమా లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీత స్వరాలు.. అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాకు శివ రాజ్ కుమార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.