సాంగ్ షూట్ లో రవితేజ "రావణాసుర"

Raviteja Ravanasura Movie Update. "ఖిలాడీ", "రామారావు ఆన్ డ్యూటీ" లాంటి డిజాస్టర్ ల తర్వాత మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు

By Sumanth Varma k  Published on  18 Jan 2023 5:11 PM IST
సాంగ్ షూట్ లో రవితేజ రావణాసుర
"ఖిలాడీ", "రామారావు ఆన్ డ్యూటీ" లాంటి డిజాస్టర్ ల తర్వాత మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు "ధమాకా" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అనంత‌రం మెగాస్టార్ వాల్తేరు వీరయ్యలో మెరిశాడు. ఆపై తన నెక్స్ట్ సినిమా "రావణాసుర" పై రవితేజ ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం రవితేజ ఈ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. నేడు అన్నపూర్ణ స్టూడియోలో రావణాసుర సాంగ్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ షూట్ లో రవితేజ కూడా పాల్గొన్నాడు.


రవితేజ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలోనే "రావణాసుర" సినిమా ప్రమోషన్లు మొదలు కానున్నాయి. అయితే ఈ సినిమా పాటలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పాటల చిత్రీకరణ జరుగుతుంది. కాగా త్వరలోనే ఈ సాంగ్స్ షూట్ ను పూర్తి చేసుకుని 2023 సమ్మర్ కి ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మరి రవితేజ "రావణాసుర" సినిమాతో తన సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేస్తాడా లేడా అనేది చూడాలి.

అన్నట్టు పక్కా మాస్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజతో పాటు యంగ్ హీరో సుశాంత్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక రవితేజ సరసన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, పూజిత, మేఘా ఆకాశ్, అను ఇమ్మన్యూయేల్, దక్షా నగర్కార్ హీరోయిన్స్ గా నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.


Next Story