మరోసారి ఆ హీరోయిన్ తో రవితేజ

రవితేజ కెరీర్‌లో 'ధమాకా' మంచి కమర్షియల్ సక్సెస్ ను సాధించింది. ఈ సినిమా రవితేజ కెరీర్ లో మంచి విజయాన్ని సాధించింది.

By Medi Samrat  Published on  28 May 2024 10:00 AM IST
మరోసారి ఆ హీరోయిన్ తో రవితేజ

రవితేజ కెరీర్‌లో 'ధమాకా' మంచి కమర్షియల్ సక్సెస్ ను సాధించింది. ఈ సినిమా రవితేజ కెరీర్ లో మంచి విజయాన్ని సాధించింది. ఈ ప్రాజెక్ట్ తర్వాత, మాస్ మహారాజా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వంటి చిత్రాలలో కనిపించాడు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. తన కెరీర్ లో 75వ చిత్రం కోసం రవితేజ సిద్ధమవుతూ ఉన్నారు. ఈ సినిమాలో ధమాకాలో నటించిన శ్రీలీలతో జతకట్టాలని నిర్ణయించుకున్నాడు.

ధమాకా.. శ్రీ లీలా కెరీర్‌కు ఒక మలుపు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాకు చాలా ప్లస్ అయింది. శ్రీలీల వరుసగా సినిమాలు చేసేసి.. ఇప్పుడు సెలెక్టివ్ గా సినిమాలను ఒప్పుకుంటూ హిట్‌ కోసం తహతహలాడుతోంది. రవితేజ 75 సినిమా కోసం కొత్త దర్శకుడు భాను భోగవరపుతో జతకట్టనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకరా స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాయి. ధమాకా చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ ఈ ప్రాజెక్ట్‌కి కూడా స్వరాలు సమకూరుస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే బయటకు రానుంది.

Next Story