రవితేజ 'రావణాసుర' నుంచి అదిరిపోయే పోస్టర్
Ravi Teja Ravanasura movie new poster.మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ
By తోట వంశీ కుమార్ Published on 14 Jan 2022 11:30 AM ISTమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ నటించిన 'కిలాడీ' చిత్రం విడుదలకు సిద్దంగా ఉండగా..'రామారావు ఆన్ డ్యూటీ' అనే చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మరో చిత్రాన్ని రవితేజ పట్టాలెక్కించారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం 'రావణాసుర'. `హీరోస్ డోన్ట్ ఎగ్జిస్ట్ ` అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
భోగి సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి ముందు `రావణాసుర` రవితేజ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించారు. పూజా కార్యకార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. స్క్రిప్ట్ ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు బాబి గోపీచంద్ మలినేని దర్శకుడు సుధీర్ వర్మకు అందించారు.
Happy Sankranthi!!#Ravanasura... very excited 😊 pic.twitter.com/wHYFuKzIMr
— Ravi Teja (@RaviTeja_offl) January 14, 2022
మెగాస్టార్ రివీల్ చేసిన `రావణాసుర` లుక్ పోస్టర్ సరికొత్తగా ఉంది. రవితేజ కౌబాయ్ తరహాలో భారీ సిగర్ ని వెలిగిస్తూ రగ్గ్డ్ లుక్ లో కనిపిస్తున్న తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్ లు రవితేజకు జోడిగా కనిపించనున్నారు. `జాంబిరెడ్డి` ఫేమ్ దక్షా నాగర్కర్ లేడీ విలన్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.