రవితేజ 'ధ‌మాకా' నుంచి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌

Ravi Teja Dhamaka movie First Single Jinthaak Lyrical Video Out. రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ధమాకా'. ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.

By అంజి  Published on  18 Aug 2022 2:57 PM IST
రవితేజ ధ‌మాకా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌

రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ధమాకా'. ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి 'జింతాక్‌' ఫస్ట్‌ సింగిల్‌ను చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేసింది. 'నిన్ను సడబుద్ధైతంది రాజిగో.. మాటాడ బుద్ధైతంది రాజీగో' అంటూ తెలంగాణ సాహిత్యంతో సాగిన ఈ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను, రవితేజ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. 'క్రాక్‌' సినిమా తర్వాత రవితేజ సినిమా పెద్ద హిట్‌ కాలేదు. ఇటీవలే భారీ అంచనాలతో రిలీజైన 'రామారావు ఆన్‌ డ్యూటీ' కూడా ప్రేక్షకులను నిరాశపర్చింది. రొటీన్‌ స్టోరీ కారణంగా బాక్సాఫీస్‌ దగ్గర సక్సెస్‌ కాలేకపోయింది.

ఈ క్రమంలోనే అభిమానుల్లో 'ధ‌మాకా'తో జోష్ నింపేందుకు ర‌వితేజ సిద్ధం అవుతున్నారు. ర‌వితేజ మార్కు కామెడీ అంశాల‌తో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలోని ఫ‌స్ట్ సింగిల్‌ను ఇవాళ చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసింది. తాజాగా రిలీజైన తెలంగాణ సాహిత్యంతో సాగిన పాట‌ను కాస‌ర్ల శ్యామ్ రాశారు. భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ ఆల‌పించారు. భీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి మ్యూజిక్‌ అందిస్తున్నారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఈ పాట ర‌వితేజ అభిమానుల‌ను ఆక‌ట్టుకుటోంది. ఈ సినిమాలో ర‌వితేజ‌కు జోడీగా శ్రీలీల న‌టిస్తోంది. పె

ధ‌మాకా షూటింగ్ చివరి దశకు చేరుకున్న‌ట్లు తెలిసింది. ఈ ఏడాది ఎండింగ్‌లోనే సినిమా రిలీజ్ కానుంది. ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ క‌థ‌ను అందిస్తుండగా, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Next Story