మాస్ మహారాజా ర‌వితేజ 'రావణాసుర' నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

Ravanasura Movie Second single will be out on Feb 18.వ‌రుస హిట్ల‌తో మాస్ మ‌హారాజా ర‌వితేజ పుల్ స్వింగ్‌లో ఉన్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2023 11:20 AM IST
మాస్ మహారాజా ర‌వితేజ రావణాసుర నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

వ‌రుస హిట్ల‌తో మాస్ మ‌హారాజా ర‌వితేజ పుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒక‌టి సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ‘రావణాసుర’ చిత్రం ఒక‌టి. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్‌వర్క్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న అను ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లాలు న‌టిస్తున్నారు. అక్కినేని సుశాంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఈ చిత్రం నుంచి ఇటీవ‌ల "రావ‌ణాసుర థీమ్" సాంగ్‌ను విడుద‌ల చేయ‌గా.. ఎలక్ట్రిఫైయింగ్ మరియు వైబ్రెంట్ ట్రాక్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్‌ సింగిల్ కు సంబంధించిన‌ అప్‌డేట్‌ను విడుద‌ల చేశారు. "ప్యార్‌లోన పాగల్‌" అంటూ సాగే ఈ పాట‌ను ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story