సౌత్‌ సినిమాలపై రష్మిక కాంట్రవర్సీ కామెంట్స్‌.. నెటిజన్లు ఫైర్

Rashmika mandanna comments on south movies and songs goes viral. నేషనల్ క్రష్ రష్మిక మందన్న శాండల్‌వుడ్ 'కిరిక్ పార్టీ' సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి టాలీవుడ్

By అంజి  Published on  29 Dec 2022 2:01 PM IST
సౌత్‌ సినిమాలపై రష్మిక కాంట్రవర్సీ కామెంట్స్‌.. నెటిజన్లు ఫైర్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న శాండల్‌వుడ్ 'కిరిక్ పార్టీ' సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి టాలీవుడ్ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఈ మధ్య వివాదాలకు రష్మిక కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. పలు సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేస్తూ హాట్‌ టాపిక్‌ అవుతోంది. తాజాగా ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు తెగ ట్రోల్‌ అవుతున్నాయి. అమితాబ్ సినిమా 'గుడ్ బై'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న తన 2వ సినిమా 'మిషన్ మజ్ను' ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. మిషన్ మజ్ను సినిమా ప్రమోషన్ సందర్భంగా రష్మిక మందన్న చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా ప్రమోషన్‌లో రష్మిక మాట్లాడుతూ.. రొమాంటిక్ సాంగ్స్ చూపించడంలో బాలీవుడ్ బెస్ట్ అని చెప్పింది. సౌత్ సినిమాలు అలా ఉండవని, సౌత్‌లో మాస్ మసాలా, ఐటెం సాంగ్స్ ఎక్కువగా ఉంటాయని రష్మిక చెప్పడంతో సౌత్ సినిమా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రష్మిక మందన్నపై నెటిజన్లు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కన్నడ నుంచి తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూనే కన్నడ చిత్రాలను చిన్నచూపు చూశారని, ఇప్పుడు హిందీలో నటిస్తూ సౌత్ ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

రష్మిక 'నీ మాటలు సరిగా లేవు, నోరు అదుపులో పెట్టుకోవాలి' అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. రష్మిక కూడా 'మిషన్ మజ్ను' మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇది స్పై థ్రిల్లర్ సినిమా. సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story