ఐదేళ్ల‌లో 5 న‌గ‌రాల్లో ఐదు ల‌గ్జ‌రీ ఇళ్లు కొన్న ర‌ష్మిక‌..!

Rashmika Mandanna bought five luxury flats.'ఛ‌లో' చిత్రంతో టాలీవుడ్‌లో అడుపెట్టిన చిన్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Feb 2023 2:15 PM IST
ఐదేళ్ల‌లో 5 న‌గ‌రాల్లో ఐదు ల‌గ్జ‌రీ ఇళ్లు కొన్న ర‌ష్మిక‌..!

'ఛ‌లో' చిత్రంతో టాలీవుడ్‌లో అడుపెట్టిన చిన్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా కెరీర్‌లో దూసుకుపోతుంది ఈ క‌న్న‌డ బ్యూటి. వ‌రుస చిత్రాల‌తో పుల్ బిజీగా ఉంది. ‘పుష్ప’ చిత్రంతో నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారింది. ఒక్కొ చిత్రానికి అమ్మ‌డు భారీగానే పారితోషికం అందుకుంటుంద‌ని వినికిడి. ఇక త‌న కెరీర్‌ను ప్రారంభించి కేవ‌లం ఐదు సంవ‌త్స‌రాల్లో ర‌ష్మిక ఐదు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఐదు విలావ‌వంత‌మైన ఇళ్ల‌ను కొనుగోలు చేసింద‌ట‌.

"కూర్గ్‌, ముంబై, హైద‌రాబాద్‌, గోవా, బెంగ‌ళూరు న‌గ‌రాల్లో లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొనేసింది. 2021లో బ్యాక్ టు బ్యాక్ ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేసింద‌ని" ఓ ట్వీట్ ప్ర‌స్తుతం నెటింట్ట వైర‌ల్‌గా మారింది. ఇక ఈ ట్వీట్ ర‌ష్మిక దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై ర‌ష్మిక ఇలా స్పందించింది. ఇదంతా నిజం కావాల‌ని కోరుకుంటున్నా అని అంది.

'ఇవ‌న్నీ అవాస్త‌వాలే. అస‌లు ఇలాంటి వార్త‌ల‌ను ఎవ‌రు సృష్టిస్తారో అర్థం కావ‌డం లేదు. నిజ‌మైతే బాగుండు" అని అంది.

ఇక సినిమాల విష‌యాని వ‌స్తే.. రష్మిక ఇటీవలే విజయ్‌ సరసన నటించిన ‘వారిసు’ చిత్రంతో తమిళ్‌లో హిట్ కొట్టింది. ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'యానిమ‌ల్' చిత్రంలో న‌టిస్తుంది. అంతేకాకుండా తెలుగులో ' పుష్ప‌-2' లో న‌టిస్తోంది.

Next Story