ఆ ఇద్దరూ కలిసి ఒకే పాటకు డ్యాన్స్ చేస్తే..

Rashmika Mandanna And Madhuri Dixit Dance To Maja Ma Song. ఒకప్పటి డ్రీమ్ గర్ల్ 'మాధురి దీక్షిత్' కాగా.. ఇప్పుడు ఎంతో మందికి క్రష్ 'రష్మిక మందాన'.

By Medi Samrat
Published on : 30 Sept 2022 7:21 PM IST

ఆ ఇద్దరూ కలిసి ఒకే పాటకు డ్యాన్స్ చేస్తే..

ఒకప్పటి డ్రీమ్ గర్ల్ 'మాధురి దీక్షిత్' కాగా.. ఇప్పుడు ఎంతో మందికి క్రష్ 'రష్మిక మందాన'. ఇద్దరు కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేస్తే.. అభిమానులు ఫుల్ ఖుషీ అవుతారు. తాజాగా అలాంటి ఓ అరుదైన కలయిక చోటు చేసుకుంది. ఇద్దరూ కలిసి ఓ పాటకు చిందేశారు.

రష్మిక ప్రస్తుతం 'గుడ్‌బై' చిత్రం ప్రమోషన్‌స్ లో ఉంది. ఇటీవలే డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జా 10లో కనిపించింది. ఈ షోలో న్యాయనిర్ణేతలుగా మాధురీ దీక్షిత్, కరణ్ జోహార్, నోరా ఫతేహి ఉన్నారు. మాధురీ దీక్షిత్ కొత్త చిత్రం మజా మా లోని 'బూమ్ పడి' పాటకు రష్మికతో కలిసి డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. "Maja Ma with Rashmika Mandanna." The actress also added hashtags for her films like, "#MajaMaOnPrime #jhalakdikhlajaa #BoomPadi and #BoomPadiWithMadhuri." అంటూ మాధురీ దీక్షిత్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మాధురీ దీక్షిత్ రాబోయే చిత్రం మజామాకు ఆనంద్ తివారీ దర్శకత్వం వహించారు. మజా మా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో గజరాజ్ రావ్, బర్ఖా సింగ్, షీబా చద్దా, సృష్టి శ్రీవాస్తవ కూడా కనిపించనున్నారు.



Next Story