అన్నయ్యను.. అలా బకరా చేసిన రాశీ ఖన్నా..

Rashi Kanna Shares Holi Celebration Video. తాజాగా రాశీ ఖన్నా హొలీ రోజు ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేసింది.

By Medi Samrat
Published on : 29 March 2021 12:28 PM IST

Rashi Kanna Shares Holi Celebration Video
హోలీ కావడంతో పలువురు ప్రముఖులు తమ అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు, వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. తాము రంగుల్లో ఉన్న ఫోటోలను, రంగులతో సెలెబ్రేట్ చేసుకుంటున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా రాశీ ఖన్నా హొలీ రోజు ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేసింది.


ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే.. తన సోదరుడి చేతిలోకి రెండు వైపులా దారంతో కట్టిన రెండు బాటిల్స్ ను ఉంచింది. అలా అర చేతులతో ఆ దారాన్ని పట్టుకోమని చెప్పింది. అలా అతడు పట్టుకుని ఉండగా.. అతడి అరచేతులపై ఓ వస్త్రంలో రంగులు ఉంచింది. తాను తెచ్చుకున్న కత్తెరతో ఒక్కసారిగా ఆ తాడును కత్తిరించింది. అలా చేస్తే చేతుల్లో ఉన్న బరువు కాస్తా తగ్గిపోతుంది. వెంటనే రాశీ ఖన్నా సోదరుడి చేతులు కాస్తా పైకి లేవగా.. ఆ వస్త్రంలో ఉన్న రంగులు కాస్తా అతడి ముఖానికే అంటుకున్నాయి. ఈ ప్రాంక్ వీడియోలో తన సోదరుడికి రంగులు అంటుకోవడంతో రాశీ ఖన్నా నవ్వుతూ ఉండిపోయింది. చిన్నప్పుడు తన సోదరుడు ఎన్నో ప్రాంక్ లు చేసి తనని ఏడిపించేవాడని.. ఇప్పుడు తాను రివెంజ్ తీసుకున్నానని రాశీ ఖన్నా తెలిపింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది.



Next Story