న్యూడ్ ఫోటోషూట్ ఎఫెక్ట్.. ఇబ్బందుల్లో రణ్‌వీర్ సింగ్

Ranveer Singh accused of 'hurting women's sentiments' over nude shoot. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ పేపర్ మ్యాగజైన్ కోసం న్యూడ్‌గా

By M.S.R
Published on : 25 July 2022 8:30 PM IST

న్యూడ్ ఫోటోషూట్ ఎఫెక్ట్.. ఇబ్బందుల్లో రణ్‌వీర్ సింగ్

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ పేపర్ మ్యాగజైన్ కోసం న్యూడ్‌గా ఫొటోలకు ఫొజులిచ్చాడు. ఈ ఫొటో షూట్‌తో అతడిని ఇబ్బందుల్లో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. మహిళల మనోభావాలను కించపరిచాడని ముంబై పోలీసులు అతడికి వ్యతిరేకంగా కేసును నమోదు చేశారు. 'మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ' రణవీర్ పై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులకు అందిన ఫిర్యాదులో రణవీర్ సింగ్ మహిళల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. రణవీర్ న్యూడ్ ఫోటోషూట్ ఫోటోలు ఆన్‌లైన్‌లో కనిపించినప్పటి నుండి వివాదం మొదలైంది. ఇక టిఎంసి ఎంపి, బెంగాలీ నటి మిమీ చక్రవర్తి మాట్లాడుతూ.. మహిళలు ఇలాంటి చిత్రాలను అప్లోడ్ చేస్తే ఒప్పుకుంటారా అని అడిగారు. రణవీర్ న్యూడ్ ఫొటో షూట్‌ను కొంత మంది సమర్థిస్తే, మరికొంత మంది మాత్రం అతడిపై దుమ్మెత్తి పోశారు.

Next Story