'ఉప్పెన' సర్‌ప్రైజ్ వ‌చ్చేసింది..!

Ranguladdhukunna Song From Uppena

By Medi Samrat  Published on  12 Nov 2020 3:00 AM GMT
ఉప్పెన సర్‌ప్రైజ్ వ‌చ్చేసింది..!

మెగామేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం ఉప్పెన‌. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి 'నీ కన్ను నీలి సముద్రం', 'ధక్‌ ధక్‌ ధక్‌' పాటలు విడుదలై విశేష ఆదరణ పొందాయి. 'రంగులద్దుకున్న' అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్‌ను ఈ రోజు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్రబృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అన్న‌ట్లుగానే ఆ పాటను సూప‌ర్ స్టార్‌ మహేష్ బాబు రిలీజ్ చేశారు. మంచి ఫీల్ ఉన్న ఈ సాంగ్‌ ఆక‌ట్టుకుంటోంది. దీనిని శ్రీమణి రచించారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ రచన సహకారం అందించిన ఈ చిత్రం వేసవిలోనే విడుదల కావాల్సి ఉన్నా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, థియేటర్లు తెరుచుకోగానే ప్రేక్షకుల ముందుకు రానుంది.Next Story