హిందూ మనోభావాలను దెబ్బతీశాడంటూ.. రణబీర్ కపూర్‌పై ఫిర్యాదు

రణబీర్‌ కపూర్ క్రిస్మస్ వేడుకల వీడియోలలో ఒకదానికి సంబంధించి చిక్కుల్లో పడ్డాడు. ఈ వీడియోలో రణబీర్‌ చేసిన ఓ కామెంట్ అతడిని చిక్కుల్లో పడేసింది.

By అంజి
Published on : 28 Dec 2023 9:08 AM IST

Ranbir Kapoor, religious sentiments, Bollywood

హిందూ మనోభావాలను దెబ్బతీశాడంటూ.. రణబీర్ కపూర్‌పై ఫిర్యాదు

ఇటీవల విడుదలైన 'యానిమల్' సినిమాతో బాలీవుడ్‌ నటుడు రణబీర్‌ కపూర్‌ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా హిట్‌ని రణబీర్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. క్రిస్మస్‌ పండుగను కూడా చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అయితే తాజాగా రణబీర్‌ క్రిస్మస్ వేడుకల వీడియోలలో ఒకదానికి సంబంధించి చిక్కుల్లో పడ్డాడు. ఈ వీడియోలో రణబీర్‌ చేసిన ఓ కామెంట్ అతడిని చిక్కుల్లో పడేసింది. దీంతో రణబీర్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ముంబైలోని ఇద్దరు న్యాయవాదులు.. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అతని కుటుంబ సభ్యులపై క్రిస్మస్ వేడుకల వీడియోను ప్రస్తావిస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, "సనాతన్ ధర్మం"ను అవమానించారని ఆరోపిస్తూ ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రణబీర్‌ కపూర్‌ వైరల్‌ వీడియోపై న్యాయవాది ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలో రణబీర్‌ కేక్ వెలిగించి "జై మాతా ది" అని చెప్పడం కనిపించింది, అయితే కేక్‌పై జహాన్ కపూర్ వైన్ పోశారు. కునాల్ కపూర్ నివాసంలో క్రిస్మస్ లంచ్‌లో రణబీర్ కపూర్.. అతని కుటుంబంతో కలిసి కనిపించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో 'ఫరాజ్'తో అరంగేట్రం చేసిన జహాన్ కపూర్ దానిపై వైన్ పోస్తుండగా, కునాల్ కపూర్ క్రిస్మస్ కేక్ ముందు కూర్చున్నట్లు చూడవచ్చు. అతను పూర్తి చేసిన తర్వాత, రణబీర్ కపూర్ కేక్ వెలిగించి, 'జై మాతా ది' అని చెప్పాడు. హిందూమతంలో, ఇతర దేవతలను పిలిచే ముందు అగ్నిదేవుడిని ఆరాధిస్తారు.

అయితే కపూర్, అతని కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగా హిందూ మతంలో నిషేధించబడిన మత్తు పదార్థాలను మరొక మతం యొక్క పండుగ జరుపుకునే సమయంలో ఉపయోగించారు. దాంతో పాటు "జై మాతా ది" అని నినాదాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఫిర్యాదుదారుని మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంది. ఈ రకమైన నేరపూరిత చర్య ఫిర్యాదుదారు, సనాతన ధర్మీయుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి ఆందోళనకరమైన వీడియోల ప్రచారం వల్ల శాంతిభద్రతలు ప్రమాదంలో పడతాయని న్యాయవాదులు పేర్కొన్నారు.

Next Story