Video : అద్భుతమైన విజువల్స్‌తో.. బిగ్ స్క్రీన్ వండర్..!

రణబీర్ కపూర్ శ్రీరామునిగా నటిస్తున్న రామాయణ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను నిర్మాతలు విడుదల చేశారు.

By -  Medi Samrat
Published on : 2 April 2026 11:34 AM IST

Video : అద్భుతమైన విజువల్స్‌తో.. బిగ్ స్క్రీన్ వండర్..!

రణబీర్ కపూర్ శ్రీరామునిగా నటిస్తున్న రామాయణ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను నిర్మాతలు విడుదల చేశారు. నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది ఈ టీజర్. దాదాపు 2.5 నిమిషాల ఈ టీజర్ లో మర్యాద పురుషోత్తముడైన రామునిగా ప్రధాన పాత్ర పోషిస్తున్న కపూర్, ఒక రాజుగా, ఆదర్శ పుత్రుడిగా, యోధుడిగా కనిపిస్తారు. ఎనిమిదిసార్లు ఆస్కార్ గెలుచుకున్న DNEG స్టూడియో, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి రూపొందించిన అద్భుతమైన విజువల్స్‌ ఈ టీజర్ సొంతం.

ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా మొదటి భాగం విడుదల కానుంది. రామాయణంలో సాయి పల్లవి సీతాదేవిగా, రవీ దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు.



Next Story