ఆన్‌లైన్ లో హెచ్‌డిలో లీకైన 'బ్రహ్మాస్త్ర'
Ranbir Kapoor, Alia Bhatt's Brahmastra leaks online. రణబీర్ కపూర్-ఆలియా భట్ కలిసి నటించిన భారీ సినిమా 'బ్రహ్మాస్త్ర'.
By Medi Samrat Published on 10 Sept 2022 3:38 PM ISTరణబీర్ కపూర్-ఆలియా భట్ కలిసి నటించిన భారీ సినిమా 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున వంటి స్టార్స్ కూడా నటించారు. దేశ వ్యాప్తంగా భారీగా విడుదలైంది ఈ సినిమా..! చాలా రోజుల తర్వాత ఓ బాలీవుడ్ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే ఈ సినిమాను పైరసీ భూతం వెంటాడుతూ ఉంది.
బ్రహ్మాస్త్ర సినిమాను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయవద్దని ఢిల్లీ హైకోర్టు 18 వెబ్‌సైట్‌లను హెచ్చరించినప్పటికీ, ఈ చిత్రం ఆన్‌లైన్‌లో లీక్ చేయబడింది. సెప్టెంబర్ 9న థియేటర్లలో బ్రహ్మాస్త్ర విడుదలైంది. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు, రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన 18 వెబ్‌సైట్‌లను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయకుండా నిరోధించాలని కోరింది ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ స్టార్ ఇండియా. ఢిల్లీ హైకోర్టు హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఈ చిత్రం తమిళ్‌రాకర్స్, మూవీరుల్జ్, ఫిల్మిజిల్లా, 123మూవీస్, టెలిగ్రామ్, టోరెంట్ సైట్‌లలో హెచ్‌డిలో ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు సమాచారం.
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 9 వేలకు దగ్గర స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ మొదటి రోజు 75 కోట్ల భారీ గ్రాస్ ని రాబట్టిందని మేకర్స్ తెలిపారు. ఈ ఏడాది మరో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.