రాక్షస రాజాగా మారిన రానా!
దగ్గుబాటి రానాకు భారీ పాపులారిటీ ఉన్నా కూడా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Dec 2023 4:30 PM ISTరాక్షస రాజాగా మారిన రానా!
దగ్గుబాటి రానాకు భారీ పాపులారిటీ ఉన్నా కూడా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడు. బాహుబలి సినిమా ద్వారా భారీ సక్సెస్ అందుకున్నాక కూడా రానా చాలా తక్కువగా సినిమాలను చేస్తూ వస్తున్నాడు. దగ్గుబాటి రానా వరుసగా సినిమాలు చేయాలని ఆయన అభిమానులు కోరుతూనే ఉన్నారు. అయితే తాజాగా రానా ఒక సినిమానూ ఓకే చేశారు. తన కొత్త సినిమాను టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తేజతో చేయబోతున్నాడు. ఈ విషయాన్ని తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా దగ్గుబాటి రానా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ చిత్రానికి 'రాక్షస రాజా' అనే టైటిల్‌ను కూడా పెట్టినట్లు అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దగ్గుబాటి రానా విడుదల చేశాడు.
గతంలో తేజ - దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో 'నేనే రాజు నేనే మంత్రి' అనే సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో వస్తున్న 'రాక్షస రాజా' ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దగ్గుబాటి రానా నుదిటిపై నామాలు పెట్టుకుని కనిపించాడు. భుజం మీద పెద్ద గన్‌ను పట్టుకుని ఉన్నాడు. ఒకవైపు బుల్లెట్లను కూడా వేసుకున్నాడు. ఈ ప్రాజెక్టుపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రాక్షస రాజా సినిమా తారాగణం, ఇతర టెక్నీషియన్స్ ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు, "రాక్షస రాజా తెలుగు సినిమా రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు" అని మేకర్స్ తెలిపారు.