రానా నాయుడు టీజ‌ర్‌.. వెంకీ, రానా అద‌ర‌గొట్టేశారు

Rana Naidu Official Teaser release.ద‌గ్గుబాటి హీరోలు వెంక‌టేశ్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లోన‌టించిన వెబ్ సిరీస్ రానా నాయుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sep 2022 8:24 AM GMT
రానా నాయుడు టీజ‌ర్‌.. వెంకీ, రానా అద‌ర‌గొట్టేశారు

ఇటీవ‌ల కాలంలో మ‌ల్టీస్టార‌ర్స్ ట్రెండ్ న‌డుస్తోంది. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌ల్లోనూ హీరోలు క‌లిసి న‌టిస్తున్నారు. ద‌గ్గుబాటి హీరోలు వెంక‌టేశ్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన వెబ్ సిరీస్ "రానా నాయుడు". యాక్ష‌న్‌, క్రైమ్ నేప‌థ్యంలో ఈ తెర‌కెక్కుతున్న ఈ సిరీస్‌లో వీరిద్ద‌రూ తండ్రీ కొడుకులుగా న‌టిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో రానా నాయుడు టీజ‌ర్‌ను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది నెట్‌ఫ్లిక్స్.

సాయం కావాలా..? అనే రానా చెప్పిన డైలాగ్‌తో ఈ టీజ‌ర్ మొద‌లైంది. ఆద్యంతం టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. "మీ సాయం గురించి మేమెంతో విన్నాం.. సెల‌బ్రిటీ ఎవ‌రైనా స‌మ‌స్య‌ల్లో ఉంటే.. వాళ్లు నీకే ఫోన్ చేస్తారు" అనే డైలాగ్‌లు అల‌రిస్తున్నాయి. టీజర్ చూస్తుంటే.. రానా, వెంకటేష్ ఇద్దరూ కూడా పోటాపోటీగా నటించినట్టు అర్థం అవుతోంది. వృద్ధుడిగా వెంకీ క‌నిపించిన తీరు చాలా కొత్త‌గా ఉంది. టీజర్ చివ‌ర‌ల్లో రానా.. వెంకటేష్ మీదకి తుపాకీ పట్టుకొని వచ్చిన సీన్ అయితే హైలెట్ అని చెప్ప‌వ‌చ్చు.

అమెరిక‌న్ టీవీ సిరీస్" రే డొనోవ‌న్‌"కు రీమేక్ గా తెర‌కెక్కుతోంది. లోకోమోటీవ్ గ్లోబ‌ల్ మీడియా ప‌తాకంపై సుంద‌ర్ అరోన్ నిర్మించారు. సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్‌, ఆశిష్ విద్యార్థి, గౌర‌వ్ చోప్రా, సుచిత్రా పిళ్లై త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Next Story