నీచంగా చూస్తున్నారంటూ.. ర‌మ్య‌కృష్ణ‌పై ఆరోప‌ణ‌లు.. స్పందించిన శివ‌గామి

Ramya Krishnan Reacts Vanitha Vijaykumar Allegations.తమిళ సినీ నటి వనిత విజయకుమార్ ఇప్పటికే ఎన్నో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2021 6:46 AM GMT
నీచంగా చూస్తున్నారంటూ.. ర‌మ్య‌కృష్ణ‌పై ఆరోప‌ణ‌లు.. స్పందించిన శివ‌గామి

తమిళ సినీ నటి వనిత విజయకుమార్ ఇప్పటికే ఎన్నో వివాదాల్లో ఉన్నారు. ఓ వైపు ఆమె పర్సనల్ లైఫ్ గురించి కూడా పెద్ద చర్చ జరిగినా.. మరో వైపు ప్రొఫెషనల్ గా కూడా ఆమె పెద్దగా నెట్టుకు రాలేకపోతున్నారు. ఓ టెలివిజన్ షోలో అడుగుపెట్టాక నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆ షో నుండి వెళ్లిపోయినట్లు లేఖ ద్వారా తెలిపింది. తన వర్క్ ప్లేస్ లో కొందరు అనైతికంగా, వ్యతిరేకంగా స్పందించారని బాధపడింది. మగవాళ్లే కాకుండా ఆడవాళ్లు కూడా తన ఎదుగుదల చూసి తట్టుకోలేకపోయారని తెలిపింది. కెరీర్ పరంగా ఎదుగుతుంటే కొందరు తనను జలసీగా ఫీల్ అవుతున్నారని తెలిపింది. తోటి మహిళలకు తోటి మహిళ సహాయం పడాలనే ఆలోచన లేదని మండిపడింది. ఇక తను ఆ షో నుండి వెళ్లిపోవడం బాధగా ఉందని తెలిపింది. అయితే ఈ వివాదానికి నటి రమ్య కృష్ణనే కారణమనే ప్రచారం కూడా సాగుతోంది.

స్టార్‌ విజయ్‌ టీవీలో 'బిగ్‌బాస్‌ జోడిగల్‌' రియాలిటీ షోలో పాల్గొన్న ఆమె.. ఆ షో నుంచి అర్థాంతరంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఓ సీనియర్‌ నటి వల్లే తాను షోను వీడాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ షోకి హోస్ట్‌ వ్యవహరిస్తోంది నటి రమ్యకృష్ణ. పైగా ఈ షో మొత్తంలో ఆమె సీనియర్‌ కావడంతో ఆమెను ఉద్దేశించే వనితా ఈ కామెంట్లు చేసిందని ప్రచారం మొదలైంది. ఈ వివాదాన్ని ఓ కోలీవుడ్‌ న్యూస్‌ ఛానెల్‌ రమ్యకృష్ణ వద్ద ప్రస్తావించగా 'షోలో ఏం జరిగిందో ఆమెను మీరు అడిగి ఉంటే బాగుండేది.. నాకు సంబంధించినంత వరకు ఇదేం పెద్ద విషయం కాదు' అని రమ్య కృష్ణ బదులు ఇచ్చింది.

Next Story