'వ్యూహం'.. ఇది బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్: ఆర్జీవీ
Ramgopal Varma announced his latest movie title 'vyuham'. తాజాగా ఆర్జీవీ తన నెక్ట్స్ సినిమా గురించి అప్‌డేట్ తెలియజేశారు. తాను అతి త్వరలో 'వ్యూహం' అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నానని
By అంజి Published on 27 Oct 2022 3:46 PM ISTప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ నెట్టింట నానుతూ ఉంటారు. తాజాగా ఆర్జీవీ తన నెక్ట్స్ సినిమా గురించి అప్‌డేట్ తెలియజేశారు. తాను అతి త్వరలో 'వ్యూహం' అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నానని చెప్పారు. 'వ్యూహం' సినిమా బయోపిక్ కాదని.. బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని చెప్పారు. బయోపిక్‌లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయని ట్విటర్ వేదికగా ఆర్జీవీ వ్యాఖ్యానించారు.
''అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన 'వ్యూహం' కథ, రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే 'వ్యూహం' సినిమా'' అని తెలిపారు. ఈ సినిమా రెండు పార్ట్స్‌గా రాబోతుంది. మొదటి పార్ట్ 'వ్యూహం', సెకండ్ పార్ట్ 'శపథం'. ఈ రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా ఉంటాయని ఆర్జీవీ చెప్పారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం 'వ్యూహం' షాక్ నుంచి తెరుకునేలోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ పార్ట్ 2 'శపథం'లో తగులుతుందని సెటైరికల్ తెలిపారు. వ్యూహం చిత్ర నిర్మాత తనతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ అని అర్జీవీ తెలిపారు. ''ఎలక్షన్స్ టార్గెట్‌గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.'' అని ఆర్జీవీ ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు.
వ్యూహం " చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ .
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.