డెలివరీకి ఆసుపత్రిలో చేరిన ఉపాసన.. వెంట వచ్చిన రామ్ చరణ్(వీడియో)

Ramcharan wife Upasana delivery tomorrow reached Apollo Hospital Just now. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.

By Medi Samrat
Published on : 19 Jun 2023 10:08 PM IST

డెలివరీకి ఆసుపత్రిలో చేరిన ఉపాసన.. వెంట వచ్చిన రామ్ చరణ్(వీడియో)

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. మరి కొద్దిగంటల్లో ఆ ఇంట ఓ నవ శిశువు అడుగెట్టనుంది. నిండు గర్భిణీ అయిన రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసన కొద్దిసేప‌టి క్రిత‌మే ఆసుపత్రిలో చేరింది. ఆమె వెంట రామ్ చ‌ర‌ణ్, త‌ల్లి సురేఖ‌ కూడా ఆసుప‌త్రికి వెళ్లారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుంది. ఉపాస‌న‌ రేపు పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మనవడు లేదా మనవరాలు అడుగుపెట్ట‌నుంది. డెలివ‌రీ డేట్ ఫిక్స్ అవ‌డంతో ఉపాస‌న‌ కాసేప‌టి క్రిత‌మే జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు.

పెళ్లయిన పదేళ్లకు ఈ జంట తొలి బిడ్డకు జన్మనిస్తుండటంతో మెగా కుటుంబంలోనూ.. ఇటు రామ్ చ‌ర‌ణ్ అభిమానుల్లోనూ ఈ విష‌య‌మై ఆస‌క్తి నెల‌కొంది. 2012లో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ - ఉపాసన జంట తల్లిదండ్రులు కానున్నట్టు గత యేడాది డిసెంబర్ 12న ప్రకటించారు. నిండు గర్భిణీగా ఉన్న ఉపాసన ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ షేర్ చేస్తోంది. పోస్టుల‌కు స్పందించే అభిమానులు జూనియర్ చరణ్ కోసం ఎదురు చూస్తున్నామంటూ కామెంట్లు చేసేశారు.



Next Story