మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను హనుమకొండలో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాయి.
మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ తమతో కలిసి పని చేసిన హీరోలందరికి బ్లాక్‌బస్టర్‌లను అందించిందని రామ్‌చరణ్ అన్నారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్‌లకు సినిమా అంటే ఫ్యాషన్. దర్శకుడు బాబీ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రవితేజ పాత్ర నాకు ఎంతో నచ్చింది. ఇక దేశీ ప్రసాద్ అదిరిపోయే పాటలు ఇచ్చారు. నాన్నకే కాదు మా క్కూడా ఇవ్వండి అని రామ్‌చరణ్ అనడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిసాయి.
చిరంజీవి గారు మా నాన్నగారిలా లేరు మా బ్రదర్‌లా ఉన్నారు. నేను ఇక్కడికి ఓ అభిమానిగానే వచ్చాను. చిరంజీవి గారిని ఏమైనా అనాలంటే అది కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రమే అనగలరు. ఆయన మౌనంగా ఉంటారని తెలుసు. అదే ఆయన మౌనం వీడి మాట్లాడితే ఏం అవుతుందో ఎవ్వరికి తెలియదు చిరంజీవిని ఏమైనా అంటే తాము చూస్తూ ఉరుకోం. ఆయన సైలెంట్‌గా ఉంటారేమో గానీ మేము(అభిమానులం) చూస్తూ ఉండం. అని రామ్‌చరణ్ అన్నారు.
కాగా.. రామ్‌చరణ్ ఎందుకు ఈ కామెంట్స్ చేశారు..? ఎవరినుద్దేశించి చేశారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.