సస్పెన్స్ తో టెన్షన్ పెట్టడానికి వచ్చేస్తున్న 'హెబ్బా పటేల్'

Ram Karthik, Hebah Patel’s thriller opts for a digital release

By Medi Samrat
Published on : 26 Sept 2023 7:30 PM IST

సస్పెన్స్ తో టెన్షన్ పెట్టడానికి వచ్చేస్తున్న హెబ్బా పటేల్

హెబ్బా పటేల్.. 'కుమారి 21ఎఫ్' సినిమాతో టాలీవుడ్ కుర్రకారు గుండెల్లో తనదైన ముద్ర వేసింది. ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలతో కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది. అటు వెండితెర మీద.. ఇటు ఓటీటీలో కూడా హెబ్బా పటేల్ వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతోంది. హెబ్బా పటేల్ కీలక పాత్రలో విప్ల‌వ్ కోనేటి ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న సినిమా 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్'. ఈ సినిమాకు సంబంధించి మేక‌ర్స్ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివ‌రాల‌ను అనౌన్స్ చేశారు.

ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వేదిక‌గా ఈ సినిమా అక్టోబ‌ర్ 06 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ.. ”కళ్లను కప్పేసిన మూఢనమ్మకం.. నమ్మకంతో రాసుకున్న మరణశాసనం” అంటూ సోష‌ల్ మీడియాలో హెబ్బా పటేల్ పోస్ట‌ర్‌ వివరాలను షేర్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Next Story