చంద్రబాబు కంటతడిపై రామ్‌గోపాల్ వ‌ర్మ‌ షాకింగ్ కామెంట్స్

Ram Gopal Varma tweet on Chandrababu cries.నిన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఎన్న‌డూ లేనంత ఉద్విఘ్న‌మైన వాతావ‌ర‌ణం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Nov 2021 10:54 AM IST
చంద్రబాబు కంటతడిపై రామ్‌గోపాల్ వ‌ర్మ‌ షాకింగ్ కామెంట్స్

నిన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఎన్న‌డూ లేనంత ఉద్విఘ్న‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంది. 40 సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభ‌వ‌నం ఉన్న‌ టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి కంటతడి పెట్టుకోవ‌డం తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఇన్నాళ్లు త‌న‌ను మాత్ర‌మే టార్గెట్ చేసిన వైసీపీ నేత‌లు ఇప్పుడు త‌న భార్య‌ను కూడా ఈ డ‌ర్టీ పాలిటిక్స్‌లోకి లాగారంటూ ఆయ‌న కంట‌త‌డి పెట్టుకున్నారు. మ‌ళ్లీ సీఎం అయ్యేంత వ‌ర‌కు అసెంబ్లీలో అడుగుపెట్ట‌బోనంటూ చంద్ర‌బాబు శ‌ప‌థం చేసిన సంగ‌తి తెలిసిందే.

చంద్ర‌బాబు కంటత‌డి పెట్ట‌డంపై రాజ‌కీయ నాయ‌కులు ఒక్కొక్క‌రు ఒక్కొక్క శైలిలో స్పందించారు. దీనిపై ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందించాడు. దీన్ని త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం వాడుకున్నాడు. 'ఆర్జీవీ మిస్సింగ్' అంటూ ఓ సినిమా తెర‌కెక్కింది. రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను కిడ్నాప్ చేశార‌నే కథాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కింది. నిన్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ వ‌ర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్లు ఈ ట్రైల‌ర్ బ‌ట్టి తెలుస్తోంది.

'ఆర్జీవీ మిస్సింగ్' సినిమా ట్రైలర్ చూసి చంద్రబాబు కంటతడి పెట్టుకున్నాడ‌ని చెబుతూనే.. చంద్రబాబు ఏడ్చిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు వ‌ర్మ‌. అంతేకాదు.. ఈ రియాక్ష‌న్ ఇచ్చినందుకు థ్యాంకూ కూడా చెప్పాడు. వ‌ర్మ షేర్ చేసిన వీడియోలోచంద్ర‌బాబు ఏడుస్తున్న క్లిప్‌ను క‌ట్ చేసి మిమిక్రీ వాయిస్‌లో బాబు మాటల్లోనే 'ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైల‌ర్ చూశాను. ఏ విధంగా చెప్పాలో అర్థం కావ‌డం లేదు. అని చెబుతూ.. చంద్ర‌బాబు కన్నీళ్లు పెట్టుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనుకావడం ఆ వీడియోలో చూడొచ్చు. కాగా.. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story