ద్రౌప‌ది నా ఫెవ‌రేట్ క్యారెక్ట‌ర్: వ‌ర్మ‌

Ram Gopal Varma says Draupadi in Mahabharat is my favourite character.నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2022 10:08 AM IST
ద్రౌప‌ది నా ఫెవ‌రేట్ క్యారెక్ట‌ర్: వ‌ర్మ‌

నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఎప్పుడు ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో ఉంటుంటాడు. ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి అయిన ద్రౌప‌ది ముర్ము పై ఇటీవ‌ల వ‌ర్మ అనుచిత కామెంట్లు చేశారు. ద్రౌప‌ది రాష్ట్ర‌ప‌తి అయితే అప్పుడు పాండ‌వులు ఎవ‌రు..? అంత‌క‌న్నా ముఖ్యంగా కౌర‌వులు ఎవ‌రు..? అని వ‌ర్మ ట్వీట్ చేశాడు.

వ‌ర్మ చేసిన ట్వీట్‌పై అటు నెటీజ‌న్లతో పాటు ఇటు బీజేపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు. ఆయ‌న‌పై అబిడ్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వ‌ర్మ‌పై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు న‌మోదు చేయాల‌ని కోరారు. తాను చేసిన ట్వీట్ వివాదాస్ప‌దం కావ‌డంతో దానిపై వ‌ర్మ క్లారిటీ ఇచ్చి, వివాదానికి ముగింపు ప‌లికే ప్ర‌య‌త్నం చేశారు.

త‌న‌కు ఎటువంటి దురుద్దేశం లేద‌ని, మ‌హాభార‌తంలో త‌న‌కు న‌చ్చ‌న క్యారెక్ట‌ర్ ద్రౌప‌ది అని, ఆ పేరు చాలా అరుదుగా ఉంటుంద‌ని, ఆ పేరు విన‌గానే ఆ పేరుతో ముడిప‌డి ఉన్న కొన్ని పాత్ర‌లు గుర్తుకొచ్చాయ‌ని,అందుకే అలాంటి అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు వ‌ర్మ చెప్పారు ఎవ‌రి మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే విధంగా తాను కామెంట్ చేయ‌లేద‌ని వ‌ర్మ ట్వీట్ చేశారు.

Next Story