విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ కరణ్ జోహార్ తో అనుబంధం వల్లే 'బాయ్ కాట్ లైగర్' ఉద్యమం జరిగిందని అన్నారు. విజయ్ దేవరకొండ స్వభావం దీనికి కారణమని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ తీసిన లైగర్ ఆగస్టు 25, 2022న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు.
రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, "విజయ్ స్టేజ్‌పై సహజంగానే దూకుడుగా ఉంటాడు. అతను అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. కానీ బాలీవుడ్‌లో బాయ్‌కాట్ లైగర్ ఉద్యమం రావడానికి ప్రాథమిక కారణం ఈ ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న కరణ్ జోహార్. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పటి నుండి, బాలీవుడ్ జనాలు ముఖ్యంగా కరణ్ సినిమాలను బహిష్కరించడం సర్వసాధారణమైపోయింది." అని వర్మ చెప్పుకొచ్చారు. కరణ్ జోహార్ బాయ్ కాట్ లిస్ట్ లో మొదటి పేరు అని చెప్పుకొచ్చారు వర్మ. హిందీ జనాలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఎంతో సౌమ్యంగా ఉంటారని తెలిసి సౌత్ హీరోలను చాలా ఇష్టపడ్డారు. కానీ విజయ్ దేవరకొండ నిజమైన యాటిట్యూడ్ ను చూసి కాస్త షాకయ్యారని అన్నారు వర్మ.
లైగర్.. పూరి జగన్నాధ్ రచన, దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేదు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ పొడిగించిన అతిధి పాత్రలో కనిపించాడు. రమ్య కృష్ణన్, మకరంద్ దేశ్‌పాండే, రోనిత్ రాయ్.. పలువురు ఇతర పాత్రలలో కనిపించారు.