భీమ్లానాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ స్పీచ్‌పై వ‌ర్మ కామెంట్

Ram Gopal Varma comments on Pawan Kalyan speech at Bheemla Nayak Pre Release Event.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Feb 2022 11:07 AM IST
భీమ్లానాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ స్పీచ్‌పై వ‌ర్మ కామెంట్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'భీమ్లా నాయ‌క్‌'. మ‌ల‌యాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించ‌గా.. సాగర్‌.కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ న‌టించారు. ఈ చిత్రం రేపు(ఫిబ్ర‌వ‌రి 25)న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో నిన్న‌(బుధ‌వారం) సాయంత్రం హైద‌రాబాద్ యూస‌ఫ్‌గూడ‌లోని పోలీస్ గ్రౌండ్‌లో భీమ్లానాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ వేడ‌క‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం పనిచేసిన వారితో పాటు, ఈ వేడుక‌కు హాజ‌రైన అతిథులంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. సినిమా ఎలా ఉంటుందో ఒక్క ముక్క‌లో చెప్పేశారు. అహంకారానికి, ఆత్మ గౌర‌వానికి మ‌ధ్య మ‌డ‌మ తిప్ప‌ని ఓ యుద్దం ఈ చిత్ర‌మ‌ని అన్నారు.

కాగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ మాట్లాడిన మాట‌ల‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందించారు. 'ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పీచ్ ఎంతో హుందాగా, అద్భుతంగా ఉంది. ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌, తీరు మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఉంది. అందుక‌నే ఆయ‌న్ని స్టార్స్ అంద‌రిలోకెల్లా ప‌వ‌ర్‌పుల్ అనేది' అని వ‌ర్మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన స్పీచుల్లో ఇదే ది బెస్ట్‌. ఎంతో భావోద్వేగంగా, హృద‌య‌పూర్వ‌కంగా, విన‌యంగా ఉందని.. ప‌వ‌న్ స్పీచ్ వీడియోని షేర్ చేస్తూ మ‌రో ట్వీట్ చేశాడు వ‌ర్మ‌.

Next Story