మహాలక్ష్మి ఆలయంలో చరణ్‌ దంపతుల ప్రత్యేక పూజలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మెగా ప్రిన్సెస్ ‘క్లింకారా’ పుట్టింది. పాప పుట్టి నేటికి ఆరునెలలు పూర్తైంది.

By Medi Samrat  Published on  20 Dec 2023 6:00 PM IST
మహాలక్ష్మి ఆలయంలో చరణ్‌ దంపతుల ప్రత్యేక పూజలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మెగా ప్రిన్సెస్ ‘క్లింకారా’ పుట్టింది. పాప పుట్టి నేటికి ఆరునెలలు పూర్తైంది. ఈ నేపథ్యంలో చరణ్‌ దంపతులు తమ కుమార్తెతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవలే రామ్ చరణ్ దంపతులు కూతురిని తీసుకుని ముంబైకి తీసుకుని వెళ్లారు. క్లింకార పుట్టి నేటికి ఆరు నెలలు పూర్తైన సందర్భంగా.. చరణ్‌ దంపతులు తన కూతురితో కలిసి ముంబైలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. జూన్ 20న హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

డిసెంబర్ 20న క్లింకారాకు ఆరు నెలలు నిండింది. ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, 'RRR' స్టార్, అతని భార్య ముంబైలోని మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ జంట తమ కుమార్తెతో ఉన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉంది. ఆ క్లిప్‌లో జంట ఆలయం నుండి బయలుదేరి వారి కారు వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో పలువురు సెల్ఫీలు తీసుకోడానికి ఎగబడ్డారు.

Next Story