మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది మూవీ నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ షాట్ పేరుతో క్రేజీ అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ముందుగా చెప్పినట్లుగానే ఈ సినిమా క్రీడా నేపథ్యంలోనే వస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ షార్ట్ వీడియోలో... రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ కనిపించాడు. అంతేకాదు భారీ సిక్స్ కొట్టిన విజువల్స్ కూడా మనం.. ఇందులో చూడవచ్చు.
ఇక తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ లో రామ్ చరణ్ అదిరిపోయే డైలాగులతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఒకే పని చేయడానికి, ఒకేలా బతకడానికి ఇంత పెద్ద బతికెందుకు.. ఏదైనా ఈ నేలపైన ఉన్నప్పుడే చేసేయాలి.. అంటూ అదిరిపోయే డైలాగులతో రామ్ చరణ్ అదరగొట్టాడు. ఈ సినిమా వచ్చే ఏడాది అంటే 2026 మార్చి 27వ తేదీన రిలీజ్ కానుంది.
ఇది ఇలా ఉండగా... రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాను... దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన...హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో... జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పెద్దిసినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక అటు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.