భార్య షాపింగ్ చేస్తే సంచులు మోయాల్సిందే.. స్టార్ హీరో అయినా స‌రే

ఉపాస‌న షాపింగ్ పూర్తి అయ్యాక ఆ బ్యాగులు మోస్తూ త‌న వైపే చూస్తూ చ‌ర‌ణ్ ఆమె వెన‌కానే న‌డుస్తున్న ఫోటోలు వైర‌ల్‌గా మారాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2023 11:44 AM IST
Ram Charan, Upasana

అమెరికాలో చ‌ర‌ణ్ దంప‌తులు


ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఈ చిత్రం ఎంతటి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. దేశంలోనే కాకుండా విదేశాల్లో ఈ చిత్రం స‌త్తా చాటింది. ఎన్నో అవార్డులు ఈ చిత్రానికి వ‌స్తున్నాయి. ఆస్కార్ అవార్డుకు ఈ చిత్రంలోని నాటు నాటు పాట నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 12న లాస్ ఏంజిల్స్‌లో అకాడ‌మీ అవార్డుల ప్ర‌ధానోత్స‌వం జ‌ర‌గ‌నుంది.

దీంతో ఇప్ప‌టికే అమెరికాకు వెళ్లిన రామ్‌చ‌ర‌ణ్ ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. త‌న‌కు దొరికిన కాస్త స‌మ‌యంలో భార్య ఉపాస‌న ను బ‌య‌ట‌కు తీసుకువెళ్లాడు. అమెరికా వీధుల్లో వీరిద్ద‌రు తెగ సంద‌డి చేశారు. భ‌ర్త‌తో గ‌డిపిన ఆనంద క్షణాల‌ను ఉపాస‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

వీటిలో ఉపాస‌న షాపింగ్ పూర్తి అయ్యాక ఆ బ్యాగులు మోస్తూ త‌న వైపే చూస్తూ చ‌ర‌ణ్ ఆమె వెన‌కానే న‌డిచాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై అభిమానులు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా స‌రే భార్య బ్యాగులు మోయాల్సిందే, త‌ప్ప‌దు స‌ర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story