రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ డేట్ ఇదే!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'గేమ్ ఛేంజర్'.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 1:05 PM ISTరామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ డేట్ ఇదే!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ.. ఈ సినిమా నుంచి మొదట విడుదలైన పోస్టర్స్ తప్ప పెద్దగా అప్‌డేట్స్ ఏమీ లేవు. మూవీ రిలీజ్ డేట్‌పై గురించి ఎలాంటి విషయాలు బయటకు రావడం లేదు. అంతేకాదు.. ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంటి వాటిపైనా సమాచారం బయటకు రావడం లేదు. అయితే.. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా విడుదల తేదీపై సమాచారం అందిందని ఓటీటీ ప్లే రిపోర్టు తెలిపింది.
ఓటీటీ ప్లే రిపోర్టు వివరా లప్రకారం.. గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన విడుదల కానున్నట్లు తెలుస్తోంది. లాంగ్ వీకెండ్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ లభిస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక ఈ రిలీజ్ డేట్‌ను సినిమా నిర్మాత దిల్‌రాజు కూడా కన్ఫర్మ్ చేసినట్లు ఆ రిపోర్టు చెబుతోంది. అయితే.. సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతోంది.. మరో 30 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‌చరణ్ లీడ్ రోల్‌లో సినిమా రాలేదు. దాంతో.. ఆయన ఫ్యాన్స్ గేమ్‌ఛేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీకి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
గతేడాది దీపావళికే ఈ సినిమా జరగండి అనే ఫస్ట్ సింగిల్ వస్తుందని చెప్పారు. రామ్‌చరణ్ కలర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కానీ.. తర్వాత ఏమైందో తెలియదు కానీ పాట కూడా బయటకు రాలేదు. ఇక రిలీజ్ డేట్ గురించి కూడా ఎలాంటి విషయాలు తెలియలేదు. శంకర్‌ను అభిమానులు దారుణంగా ట్రోల్ చేశారు. ఎప్పుడూ వాయిదా వేస్తూనే ఉంటారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు కురిపించారు. తాజాగా.. ఓటీటీ ప్లే రిపోర్టు రిలీజ్ డేట్ చెప్పడంతో అభిమానులు కాస్త ఖుషీ అవుతున్నారు. కానీ.. అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.