సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ర‌కుల్ డ్యాన్స్‌.. ఆమె ప్రియుడు ఏమ‌న్నాడంటే..?

Rakul Preet Singh's Pasoori dance video goes viral.ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ద‌క్షిణాది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2022 10:50 AM IST
సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ర‌కుల్ డ్యాన్స్‌.. ఆమె ప్రియుడు ఏమ‌న్నాడంటే..?

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ద‌క్షిణాది అగ్ర‌క‌థానాయిక‌ల్లో ర‌కుల్ ఒక‌రు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ అక్క‌డ కూడా త‌న‌దైన ముద్ర వేయాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలో సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ డింపుల్‌ వద్ద రకుల్‌ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది. సోష‌ల్ మీడియాలో 20 కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని దూసుకుపోతున్న 'పసూరి' పాట‌కు ర‌కుల్ స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది.

ర‌కుల్ పోస్ట్ చేసిన గంట‌లోనే ఈ వీడియో 3ల‌క్ష‌ల‌కు గా వ్యూస్ వ‌చ్చాయంటే ఎంత‌లా ఈ వీడియో ట్రెండ్ అవుతుందో తెలుస్తుంది. దీనిపై నెటీజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిస్తున్నారు. ఇక ర‌కుల్ బాయ్‌ఫ్రెండ్‌, యాక్టర్‌ జాకీ భగ్నానీ.. 'డియ‌ర్ ల‌వ్‌.. నాకు కూడా నేర్పించ‌వా 'అని కామెంట్ చేశాడు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవలే 'రన్‌ వే 24', 'ఎటాక్‌' చిత్రాలతో బీటౌన్‌ ఆడియెన్స్‌ను పలకరించింది. ప్రస్తుతం రకుల్‌ చేతిలో థ్యాంక్‌ గాడ్, ఛత్రీవాలి, డాక్టర్‌ జీ, ఓ మై గోస్ట్‌, మిషన్‌ సిండ్రెల్లా, 31 అక్టోబర్‌ లేడీస్‌ నైట్‌ తదితర చిత్రాలు ఉన్నాయి.

Next Story