'హ‌లో బ్ర‌ద‌ర్‌.. నాకు పెళ్లైంది.. నన్ను ముట్టుకోవ‌ద్దు' బాలీవుడ్‌ న‌టి వీడియో వైర‌ల్‌

Rakhi Sawant Gets Annoyed At Fan For Clicking Selfies.రాఖీ సావంత్‌.. ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jan 2023 1:56 PM IST
హ‌లో బ్ర‌ద‌ర్‌.. నాకు పెళ్లైంది.. నన్ను ముట్టుకోవ‌ద్దు  బాలీవుడ్‌ న‌టి వీడియో వైర‌ల్‌

రాఖీ సావంత్‌.. ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. బాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. త‌న మాట‌లు, చేష్ట‌ల‌తో ఇటీవ‌ల ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తుంది అమ్మడు. త‌న ప్రియుడు ఆదిల్ ఖాన్‌ను ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో తాను పెళ్లి చేసుకున్న నిజాన్ని ఎట్ట‌కేల‌కు ఒప్పుకుంది.

అయితే.. రాఖీ సావంత్‌కు ఆదిల్ కొన్ని కండీష‌న్లు పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. పొట్టి దుస్తులు వేయ‌వ‌ద్ద‌ని, ప‌ద్ద‌తిగా త‌యారు అవ్వాల‌ని వంటివి అందులో ఉన్నాయట‌. భ‌ర్త చెప్పిన‌ట్లుగానే అత‌డి కోసం త‌న ప‌ద్ద‌తిని మార్చుకుంది రాఖీ. ఇక్క‌డ వ‌ర‌కు అంతా బాగానే ఉంది గానీ.. ఇటీవ‌ల ఓ అభిమానితో రాఖీ సావంత్ ప్ర‌వ‌ర్తించిన తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రాఖీ క‌న‌ప‌డ‌గానే ముంబైలో ఓ అభిమాని ఆమె ద‌గ్గ‌ర‌కు ప‌రుగెత్తుకు వ‌చ్చి సెల్ఫీ తీసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. ఈ నేప‌థ్యంలో రాఖీ "హ‌లో బ్ర‌ద‌ర్ నాకు పెళ్లైంది.. కాస్త నాకు దూరం జ‌రుగు" అని అంది. అందుకు ఆ వ్య‌క్తి స‌రేన‌ని చెప్పి సెల్పీ దిగాడు. "ఇంత‌క ముందు వేరు.. ఇప్పుడు వేరు.. న‌న్ను ముట్టుకోవ‌డానికి కూడా వీల్లేదు అర్థ‌మైందా" అని చిరు కోపం ప్ర‌ద‌ర్శ‌రించింది అమ్మ‌డు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story