జపాన్ లో ఇప్పుడిప్పుడు భారత చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులను గుర్తు పడుతున్నారు కానీ.. కొన్ని దశాబ్దాల కిందటే సూపర్ స్టార్ రజనీకాంత్ అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. 'ముత్తు' సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఎంతో మంది రజనీకాంత్ ను కలవడానికి జపాన్ నుండి చెన్నైకు వస్తూ ఉంటారు.
తాజాగా మరో సూపర్ హిట్ సినిమాతో జపాన్ లో రజనీకాంత్ సందడి చేయనున్నారు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్’ ఇప్పుడు జపాన్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. చాలా చోట్ల మరిన్ని స్క్రీన్‌లు జోడించారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు జపాన్‌లోని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జైలర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 650 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక జపాన్ లో ఎన్నో కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.
రజనీకాంత్‌తో పాటు జైలర్ 1లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, తెలుగు నటుడు సునీల్, రమ్య కృష్ణన్, వినాయకన్, తమన్నా, వసంత్ రవి, యోగి బాబు నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించారు.