రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని కలిసిన రజనీకాంత్
Rajinikanth meets President Kovind and Prime Minister Modi.
By తోట వంశీ కుమార్
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన సతీమణి లతతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను, ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. తొలుత రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి కోవింద్‌ను కలిశారు. అక్కడి నుంచి ప్రధాని నివాసాకి వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. ఈ విషయాన్ని రజనీకాంత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రాష్ట్రపతి, ప్రధానిలను కలిసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇరువురిని కలుసుకుని వారి ఆశీస్సులు, అభినందలు పొండం ఆనందంగా ఉందన్నారు.
மதிப்பிற்குரிய ஜனாதிபதி அவர்களையும் ,பிரதமர் அவர்களையும் சந்தித்து வாழ்த்துகளை பெற்றதில் பெரும் மகிழ்ச்சி. pic.twitter.com/0pFheNjnFd
— Rajinikanth (@rajinikanth) October 27, 2021
ఇటీవల రజనీకాంత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. 67వ జాతీయ సినీ అవార్డ్స్ ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రజినీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. అవార్డు రావడం పట్ల రజినీ స్పందిస్తూ.. భారత ప్రభుత్వం నాకిచ్చిన ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును నన్ను నటుడిగా గుర్తించి, తీర్చిదిద్దిన నా గురువు శ్రీ కె. బాలచందర్‌గారికి, నా పెద్దన్నయ్య శ్రీ సత్యన్నారాయణరావు గైక్వాడ్‌కు, నా స్నేహితుడు శ్రీ రాజ్ బహదూర్‌కు.. నా సినీ కుటుంబానికి చెందిన నిర్మాతలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు, సహ నటీనటులకు, పంపిణీదారులకు, థియేటర్ల యజమానులకు.. మీడియా మిత్రులకు.. నన్ను ఎంతగానో ఆరాధించే నా అభిమానులకు మరియు నాకు దైవ సమానులైన తమిళ ప్రజలకు అంకితం ఇస్తున్నాను..'' అని రజనీకాంత్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రపతి, ప్రధానిలను కలుసుకున్నారు.